చంద్ర బాబు నాయుడు

పేదరికం లేని సమాజ సృష్టి నారా చంద్రబాబునాయుడు గారి ఆశయం. చిన్న వయస్సులోనే రాష్ట్ర్రఅధినేత అయ్యే అవకాశం లభించినపుడు ఒక్క క్షణాన్ని కూడా ఆయన వృధా చేయలేదు. ‘సమాజమే దేవాలయం’ అన్న ఎన్టీఆర్ స్పూర్తితో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా వడివడిగా ముందుకు సాగిపోయారు. కష్టపడితే సాధించలేనిదేమీ లేదన్న కఠోర వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసి, అందర్నీ కర్తవ్యోన్ముఖుల్ని చేశారు.పేద-గొప్ప అనే తేడా లేకుండా అందరితో శ్రమదానం చేయించారు.దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వోద్యోగుల్ని ప్రజల వద్దకు పంపి ‘ప్రజలవద్దకే పాలన’ అన్నారు. జన్మనిచ్చిన నేలతల్లి రుణం తీర్చుకోవడానికి ‘జన్మభూమి’ ప్రవేశపెట్టి ప్రవాసాంద్రుల్ని సైతం కదిలించి నేలతల్లి రుణం తీర్చుకొనే మహత్తర అవకాశం కల్పించారు.అన్నిరంగాలలో సంస్కరణలు అమలుచేసి చతికిలపడిన రంగాలను పునరుజ్జీవింపజేశారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాముఖ్యాన్ని అందరికంటే ముందుగా గ్రహించి రాష్ట్రంలో ఐ.టి.కి విశేష ప్రాధాన్యతనిచ్చి లక్షలాది మంది యువతకు బంగారు భవిష్యత్తు కల్పించారు. అన్ని సామాజిక రుగ్మతలకు విరుగుడు ‘విద్య’ ఒక్కటేనని చాటిచెప్పి.. ప్రాధమిక విద్య మొదలుకొని సాంకేతిక ఉన్నత విద్యకు ఎనలేని ప్రోత్సాహం కల్పించారు. రాష్ట్రం నుండి ఏడాదికి లక్షమంది ఇంజనీర్లను తయారు చేసేందుకు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను ప్రోత్సహించారు. అందరికీ ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టారు. అత్య్ధధిక శాతం ఆధారపడిన రైతాంగ సంక్షేమానికి, సమాజంలో అట్టడుగున వున్న బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమానికి దేశంలో ఎక్కడా జరగని విశిష్ట కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలు చేశారు. మహిళాసాధికారతతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వసించి డ్వాక్రా లాంటి స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో వృత్తిదారులకు హాన్ని అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవకళ తెచ్చారు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించగలిగే పరిస్థితులను కల్పించేందుకు కృషి చేశారు. కుల,మత, వర్గ రాజకీయాలకు అతీతంగా.. అన్ని వర్గాలను సమాన దృష్టితో చూసి లౌకిక వాదానికి కొత్త నిర్వచనం చెప్పారు..

క్లుప్తంగా చెప్పాలంటే నారాచంద్రబాబు నాయుడు ఆధునిక దార్శనికులు. సమాజంలో సంపద సృష్ట్రికి బీజం వేసింది ఆయనే. సృష్టించబడుతున్న సంపద, ప్రభుత్వాలకు చేకూరుతున్న అత్యధిక ఆదాయం.. సమాజంలో రైతులకు, అట్టడుగు వర్గాలకు, మధ్యతరగతి వారికి అందాలన్నిది ఆయన ఆశయం. ప్రభుత్వంలో వున్నా.. ప్రతి పక్షంలో వున్నా.. నిరంతరం ప్రజల గురించి ఆయన ఆలోచన “రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రగామి కావాలి. అంతర్జాతీయంగా లభిస్తున్న అవకాశాలు రాష్ట్రం అందిపుచ్చుకోవాలి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు కావాలి. పేదరికం తొలగిపోవాలి. ఇది అసాధ్యమేమీకాదు… సాధ్యమే” అన్నది చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ. ఆయన 9సంవత్సరాల పాలన రాష్ట్రంలోఒక సువర్ణ అధ్యాయం. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి విశిష్ట స్థానం లభించిన అపురూప సందర్భం. తెలుగువారి ఆత్మవిశ్వాసం కొండంత పెరిగిన అధ్బుత సమయం…

Developed and Maintained by Inspiredge

Facebook Iconfacebook like buttonTwitter Icontwitter follow buttonVisit Our googleplus